మౌలిక వసతులకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి

మౌలిక వసతులకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి
  •     ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డి

నాగర్‌‌‌‌కర్నూల్ టౌన్, వెలుగు: మున్సిపాలిటీల్లో మౌలిక వసతులకు కాంగ్రెస్​ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నాగర్‌‌‌‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డి అన్నారు. శనివారం ఆయన నాగర్​కర్నూల్​ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ, బోరు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు రోడ్లు, డ్రైనేజీ పనులను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల కోరిక మేరకు సందాయిపల్లి రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌‌‌‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. 

అనంతరం తన క్యాంపు కార్యాలయంలో బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు సునీంద్ర, నిజాముద్దీన్, శ్రీనివాసులు, బచ్చన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.