‘‘మొదటి నుంచి స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేసే అలవాటు ఉంది. అథ్లెటిక్స్‌లో నేను స్ప్రింటర్‌ని. అంటే చిన్న దూరాలను చాలా తక్కువ టైంలో చేరుకోగలను. ఆ ఫిట్నెస్ ఇప్పటికీ అలానే మెయింటెయిన్ చేస్తూ వచ్చా. స్పోర్ట్స్‌లో రాణిస్తున్నా.. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టిక్ సైడ్ కెరీర్ ఎంచుకోవాలనే ఆలోచనలో ఉండేదాన్ని. కళలే నా కెరీర్ అని అప్పుడే ఫిక్స్ అయ్యా. మ్యాథ్స్, సైన్స్ జోలికి వెళ్లకూడదనుకున్నా” అంటోన్న మాళవిక మోహనన్ (Malavika Mohanan) జర్నీ ఇది.
మాళవిక మోహనన్ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కూతురు. (తెలుగులో మహర్షి, ఫ్యామిలీ స్టార్, ది గోట్ లైఫ్).. కేరళలో పుట్టిన మాళవిక పెరిగిందంతా ముంబైలో. మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె నాన్నలాగనే సినిమాటోగ్రాఫర్ అవ్వాలనుకుంది. అదికాకపోతే డైరెక్షన్ చేయాలనుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత చదువుల కోసం వెళ్లాలని ఆలోచిస్తున్న టైంలో తన తండ్రి తీస్తున్న ఒక కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది.
మమ్ముట్టితో కలిసి నటించే చాన్స్ కావడంతో ఆ యాడ్ చేసింది. ఆ తర్వాత మమ్ముట్టి నటనపై తనకు ఆసక్తి ఉందా? అని తరచూ అడిగేవారు. ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న సినిమాలో జంటగా నటించేందుకు అడిగారు. ఆమె ఆలోచించుకోవడానికి కొంత టైం తీసుకుంది. ఆ తర్వాత ఆడిషన్లో సెలక్ట్ అయి ‘పట్టమ్ పోల్’ అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఆ టైంలోనే యాక్టింగ్, షూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేర్చుకుంది. ఆ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్‌కి హెల్త్ బాలేకపోవడంతో తనే సొంతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుంది. ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. నటన పరంగా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. దాంతో తన ఇంట్రెస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీపై మళ్లింది. ‘ది స్కార్లెట్ విండో’ అనే బ్లాగ్ కోసం ఇండియన్ ఎత్నిక్ ఫ్యూజన్ ఫ్యాషన్ థీమ్‌లో మోడలింగ్ చేసింది.
ఎనిమిది కిలోల బరువు తగ్గి..
రెండో సినిమాలో బ్యాలెట్ డాన్సర్ పాత్రలో కనిపించింది. 2016లో కన్నడలో ‘నాను మట్టు వరలక్ష్మి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ కావడంతో కొంత ఫేమ్ వచ్చింది. 2017లో మమ్ముట్టి నటించిన ‘ది గ్రేట్ ఫాదర్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది. అదే ఏడాది ‘బియాండ్ ది క్లౌడ్స్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తార పాత్రలో నటించిన ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాను ఫిల్మ్ మేకర్ మజిది తీశారు.
కెరీర్ బిగినింగ్‌లోనే ఆయన సినిమాలో ఆపర్చునిటీ రావడం సంతోషంగా ఫీలయింది. నిజానికి తను గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న రోజుల్లో సినిమాలపై వ్యాసాలు రాసేది. వాటిలో మజిది సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాలో నటించేందుకు తను పదిహేను రోజుల్లో దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గింది. చాలారోజులు తలస్నానం కూడా చేయలేదు. అంత కష్టపడి చేసిన ఆ సినిమా గుర్తింపు తెచ్చింది. ఎన్నో ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు.
ప్రభాస్ సినిమాతోనే డెబ్యూ
‘‘మాస్టర్ సినిమా తర్వాత సలార్ మూవీ కోసం ఆడిషన్‌కి రమ్మని కాల్ వచ్చింది. బెంగళూరు వెళ్లి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని కలిశాను. ఆయన నన్ను రకరకాల కాస్ట్యూమ్స్‌లో ఫొటోలు తీయించారు. కొన్ని కారణాల వల్ల నాకు చాన్స్ మిస్ అయింది. ప్రభాస్ లాంటి హీరోతో డెబ్యూ ఎంతమందికి వస్తుంది? అని మిస్ అయినందుకు చాలా బాధేసింది. అయితే కొన్ని నెలలకే మళ్లీ ప్రభాస్ పక్కన నటించే అవకాశం వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు వేరేవాళ్లని తీసుకున్నారు కదా అని అడిగా. అది వేరే సినిమా అని చెప్పారు. దాంతో వెంటనే ప్రాజెక్ట్‌కు సైన్ చేశాను.
♥️#TheRajaSaab https://t.co/XelLrWVe0c
— Malavika Mohanan (@MalavikaM_) December 29, 2025
ప్రభాస్ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉందేమో!” అంటోంది మాళవిక. రాజాసాబ్‌లో ‘భైరవి’ అనే పాత్రలో నటించింది. తనకు ఈ సినిమాలో ఫన్నీ, రొమాంటిక్, యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పింది. నాకు బాహుబలి కంటే ముందే ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అది బాహుబలి తర్వాత ఇంకా పెరిగింది. మా అమ్మకు నాకంటే ఎక్కువ ఇష్టం” అని చెప్పుకొచ్చింది.
Channelling Rani vibes for #TheRajaSaab 👑✨
— Malavika Mohanan (@MalavikaM_) December 28, 2025
Ee look ki mee prema kavali 🥰♥️#Sankranthi #Prabhas ❤️🔥 pic.twitter.com/PAtwFgzC0z
మాస్టర్ ఇచ్చిన సక్సెస్
తమిళంలో రజనీకాంత్ సినిమా ‘పెట్ట’తో డెబ్యూగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కోసం తమిళం నేర్చుకోవాలని ట్యూటర్ని కూడా పెట్టుకుంది. ఆ తర్వాత ‘మాస్టర్’ సినిమాలో విజయ్‌కి జంటగా నటించింది. మాస్టర్ ఇచ్చిన సక్సెస్ ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ‘మారన్’ అనే ధనుష్ సినిమాలో యాక్ట్ చేసింది. 2020లో మసాబా మసాబా అనే ఒక సిరీస్ చేసింది. 2023లో ‘తంగలాన్’ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్లో కనిపించింది.
ఇవే కాకుండా క్రిస్టీ, యుధ్రా, హృదయపూర్వం వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు ‘రాజాసాబ్’తో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించింది. నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా డబ్బింగ్ మూవీస్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు మాళవిక పరిచయమే. ప్రస్తుతం కార్తీ ‘సర్దార్ 2’లో నటిస్తోంది.
