సముద్ర తీరంలో సింహం.. చేపలు పడుతుందా..?

సముద్ర తీరంలో సింహం.. చేపలు పడుతుందా..?

సింహం..అడవిలో ఉన్నా..రాజే..జనాల మధ్యలో ఉన్నా రాజే. చివరకు సముద్రంలో నిలబడినా రాజే. అందుకే అంటారు..సింహాన్ని మృగరాజు అని.. అయితే ఓ సింహం  సముద్ర తీరాన నిలబడిన ఓ సింహం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
 గుజరాత్‌ తీరాన ఓ సింహం గంభీరంగా నిలబడింది. అరేబియా సముద్ర తీరంలో గర్వంగా...గంభీరంగా నిలబడింది మృగరాజు. తన కాళ్లకు అలల సవ్వడులు తాకుతూ ఉంటే..వాటిని ఎంజాయ్ చేస్తూ..సేదతీరింది. 

అరేబియా సముద్ర తీరంలో సింహం నిలబడిన ఫోటోను IFS అధికారి ప‌ర్వీన్ క‌శ్వన్ ట్విటర్‌ (X)లో షేర్‌ చేశారు.  నార్నియా ఫోటో నిజమైన వేళ... గుజరాత్‌ తీరంలో సముద్ర అలలను ఆస్వాదిస్తున్న సింహం అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

సింహం ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఏషియా సింహాలు సముద్ర తీరాల్లో నివసించడంపై చేసిన ఓ పరిశోధనా పత్రాన్ని కూడా పర్వీన్‌ షేర్‌ చేశారు. ఈ సింహాలు నివాసముండే ప్రాంతానికి వెళ్లి కొందరు ఈ ఫోటోను తీసినట్లు  తెలిపారు.  ఈ ఫోటోను ప్రశంసిస్తూ  నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింహం ఫోటో నిజంగా అద్భుతమైన దృశ్యమని మెచ్చుకుంటున్నారు.