తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫ్యూచర్ సిటీలో సోమవారం (డిసెంబర్ 08) ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం.. ప్రమోషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించారు మెస్సీ హైదరాబాద్ టూర్ చీఫ్ అడ్వైసర్ పార్వతీ రెడ్డి.
డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ చేరుకుంటాడని ఆయన చీఫ్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. టూర్ కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఎంతో మంది ప్రజలు మెస్సీ మ్యాచ్ చూసేందుకు వస్తారని తెలిపారు. మెస్సీ రాకతో ఫుట్ బాల్ కు తెలంగాణ రాష్ట్రంలో మరింత ఆదరణ పెరుగుతుందని, క్రీడాకారులు కూడా పెరుగుతారని తెలిపారు.
మెస్సీ షెడ్యూల్:
- డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు మెస్సీ
- హైదరాబాద్ చేరుకున్నాక ఒక హోటల్లో విశ్రాంతి
- సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటాడు
- స్టేడియంలో15 నిమిషాలు రెండు టీములు పోటీ పడతాయి
- మ్యాచ్ చివరి 5 నిమిషాలలో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ టీమ్ తో కలుస్తారు
- మ్యాచ్ తర్వాత చివరగా స్కూల్ పిల్లలతో మెస్సీ ఇంటరాక్షన్ ఉంటుంది.
- తర్వాత పరేడ్ ఉంటుంది, ఆ తర్వాత మెస్సీకి సన్మానం ఉంటుంది.
- ఉప్పల్ స్టేడియంలో మొత్తం గంట 40 నిమిషాల పాటు మెస్సీ గడుపుతారు.
- సౌత్ ఇండియాలోనే పెద్ద ఈవెంట్
- ఉప్పల్ స్టేడియం లో మెస్సీ టూర్ పూర్తయ్యాక అదే రోజు హైద్రాబాద్ నుండి వెళ్ళిపోతారు.
