రోడ్లపై కుక్కలు తిరిగినట్లు తిరుగుతున్న సింహాలు

రోడ్లపై కుక్కలు తిరిగినట్లు తిరుగుతున్న సింహాలు

ఆహా.. ఏం ఠీవీ.. ఏం దర్జా.. రాజమహల్ లో మహారాణి తన పరివారం వెంటరాగా దర్జాగా నడుచుకుంటూ పోతున్నట్టుంది ఈ సింహరాణి స్టయిల్.. తన పిల్లలతో కలిసి రోడ్డుపై స్టయిల్ గా నడుచుకుంటూ వెళుతోంది. ఎవరూ చూస్తే మాకేందీ.. మేమొస్తుంటే అల్లంత దూరంలో ఆగిపోవాల్సిందే అన్నట్లు ఓ చూపు చూసి మరీ వెళుతున్నాయి సింహం, దాని పిల్లలు.. గుజరాత్ లోని ఆమ్రేలీ జిల్లాలో పిపావావ్ పోర్ట్ హైవేను నిర్మొహమాటంగా, దర్జాగా దాటుతున్నాయి సింహం, దాని పిల్లలు.. దీనికి సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

సింహం, దాని పిల్లలు రోడ్డు దాటుతుండగా పిపావావ్ పోర్ట్ హైవే పై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ బైకర్ దీనిని గమనించి వీడియో తీసి ఇంటర్నెట్ పెట్టాడు. వీడియో తీస్తున్న సందర్భంగా సింహం చూసిన లుక్ చూస్తే.. మేమొస్తుంటే ఎంతటివారైనా అల్లంత దూరంలో ఆగిపోవాల్సిందే.. లేదా డేంజర్ లో పడతారు అన్నట్టుగా ఉంది. ఆమ్రేలీ తీరప్రాంతం సింహాల మనుగడకు అనుకూలమైన ప్రాంతం.. కానీ మానవులు, వన్యప్రాణులు కలిసి సహజీవనం చేయడం కొంచెం రిస్కే మరి. 

తరుచుగా ఇలాంటి సంఘటన జరుగుతుండటంతో హైవే పై వెళ్లే వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సింహాల సంతతి పెరుగుతుండటం, ఈ ప్రాంతంలో హైవే నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండటంతో ఈ హైవే ఎక్కువగా వెళ్లే ట్యాంకర్లు, డంపర్లు,ట్రక్ డ్రైవర్లలో ఇది మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్రాంతంలో సింహాలకు సంబంధించిన ప్రమాదాలు క్రమంగా పెరుగుతుండటంతో అటవీశాఖ రాత్రి పూట దాటే  సమయంలో సింహాలు, మానవుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది.