సిటీలో రెండు రోజులు వైన్ షాపులు బంద్

V6 Velugu Posted on Sep 18, 2021

వినాయక నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ లో వైన్ షాప్స్ మూసేయాలని  ఆదేశించారు పోలీసులు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు  నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వైన్ షాప్స్ మూసేయాలని చెప్పారు. పబ్ లు, బార్లు, వైన్స్ కల్లు దుకాణాలు మూసేయాలన్నీ కూడా మూసేయాలన్నారు. 

 నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా సిటీలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఇవాళ అర్థరాత్రి నుంచే సిటీలోకి లారీలను అనుమతించబోమని పోలీసులు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను కూడా కొన్నిచోట్ల దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లకు వెళ్లేవారు ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలని సూచించారు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు.

Tagged immersion, Two days, hydarabad, liqure shops close

Latest Videos

Subscribe Now

More News