ఏపీలో లిక్కర్ షాపులు బంద్

ఏపీలో లిక్కర్ షాపులు బంద్

ఆంధ్రప్రదేశ్ లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు తేదీలు ఖరారు అయ్యాయి. నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 9న తొలి ద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే రోజుల్లో సెల‌వులు ప్ర‌క‌టించాలని ప్రభుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగంగా వ‌చ్చేనెల 9, 11, 13, 21తేదీల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ప్రాంతాల్లో ప్ర‌భుత్వం సెల‌వును ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ‌కు అవ‌స‌రమైన ప్రభుత్వ కార్యాలయాలను వాడుకోవాల్సి ఉన్నందున స్థానిక సెల‌వులను ప్ర‌క‌టించారు. దీంతో పాటు స్కూళ్లకు, షాపులకు కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు పోలింగ్ తేదీకి 44 గంట‌ల ముందు నుంచి ఆయా పంచాయ‌తీల్లో లిక్కర్ అమ్మకాలను నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఎన్నికల కోడ్ అమ‌ల్లో ఉన్నందున్న ఖ‌చ్చితంగా పాటించాల‌ని.. పోలింగ్ బాక్సుల‌తో పాటు సిబ్బందిని త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వశాఖ‌ల‌కు చెందిన వాహ‌నాలు వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర్వుల్లో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.