హైదరాబాద్ సిటీ శివార్లలో 3 రోజులు మందు బంద్.. బార్లు, వైన్ షాపులు మూసివేత

హైదరాబాద్ సిటీ శివార్లలో 3 రోజులు మందు బంద్.. బార్లు, వైన్ షాపులు మూసివేత

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ సిటీ శివార్లలో మూడు రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో  ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు వైన్స్  క్లోజ్ కానున్నాయి. 

Also Read :- కేసీఆర్,కేటీఆర్,హరీశ్.. జనాభా లెక్కల్లోనే లేరు

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 135-సి  ప్రకారం ఫిబ్రవరి 25 ఉదయం 6:00 గంటల నుంచి  ఫిబ్రవరి 27 ఉదయం 6:00 గంటల వరకు వైన్ షాపులు మూసివేయబడతాయి. ఈ మేరకు  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మొహంతి ఆదేశాలు జారీ చేశారు.  కొల్లూరు, ఆర్‌సీ పురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని అన్ని కల్లు దుకాణాలు, వైన్‌ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు, స్టార్‌ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులు మూసివేయబడతాయని తెలిపారు.

 మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

 తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్​ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. వ‌రంగ‌ల్– - ఖ‌మ్మం–- నల్లగొండ  టీచర్, మెద‌క్– - నిజామాబాద్– ఆదిలాబాద్ –క‌రీంన‌గ‌ర్ టీచర్, మెద‌క్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - క‌రీంన‌గ‌ర్ గ్రాడ్యుయేట్  స్థానానికి ఎన్నిక‌లు నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు  జరగనుంది.  

 జిల్లా కలెక్టర్లతో సీఈవో సమీక్ష

మరో వైపు ఫిబ్రవరి 21న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈసందర్భంగా  పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతా చర్యలతో పాటు పోలింగ్‌ కేంద్రాల వద్ద  సౌకర్యాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు, మైక్రో అబ్జర్వర్‌ల నియామకం, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్‌ బాక్సుల ఓవరాలింగ్‌ వంటి అంశాలపై   సీఈవోకు వివరించారు కలెక్టర్లు.