లిక్కర్ కిక్కు.. సర్కార్‌‌‌‌కు రూ.2,845 కోట్ల ఆదాయం

లిక్కర్ కిక్కు.. సర్కార్‌‌‌‌కు రూ.2,845 కోట్ల ఆదాయం
  • ముగిసిన వైన్స్​ లక్కీ డ్రా.. నేడు మరో 19 షాపులకు నోటిఫికేషన్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో 2,601 మద్యం షాపులకు సంబంధించిన లక్కీ డ్రా ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 95,137 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ. 2,845 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ డ్రా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన ఎక్సైజ్ యంత్రాంగాన్ని అభినందిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ తెలిపారు. 

మరో 19 వైన్స్​కు నేడు నోటిఫికేషన్​

ఆసిఫాబాద్ (7), ఆదిలాబాద్ (6), శంషాబాద్ (3), జయశంకర్ భూపాలపల్లి (2), సంగారెడ్డి (1) జిల్లాల పరిధిలోని మరో 19 మద్యం షాపుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వీటికి దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు జరగనుంది. నవంబర్ 3న డ్రా నిర్వహిస్తారు.