
నాగ్‌పూర్‌లో పెను విషాదం తప్పింది. బస్సులో ఓ అనుమానాస్పద బ్యాగ్‌లో ఉంచిన లైవ్ బాంబ్‌ను బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. నాగ్‌పూర్‌లోని గణేష్‌పేట్ బస్ టెర్మినస్ వద్ద ఒక MSRTC బస్సును గత రెండ్రోజులుగా నిలిపిఉంచారు. ఈ బస్సులో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను డిపో సిబ్బంది కనుగొన్నారు. దాన్ని తెరిచే ప్రయత్నం చేయగా.. అందులో బాంబ్ లాంటి ఓ వస్తువు కనపడింది. వెంటనే వారు బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు.
అక్కడికి చేరుకున్న బాంబు డిస్పోజల్ అధికారులు బ్యాగ్‌ను తెరిచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు. అందులో పేలుడు పదార్థం ఉన్నట్లు నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ స్క్వాడ్ దాన్ని తనిఖీల కోసం తమ వెంట తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A suspicious object was found in a state transport bus in Ganeshpeth ST Stand, #Nagpur. @NagpurPolice said "It appeared to be an explosive. The Bomb Detection & Disposal Squad later took it away for inspection. The bus had been stationary at MSRTC bus depot for the past 2 days. pic.twitter.com/vUuGdsQkV1
— Praveen Mudholkar (@JournoMudholkar) February 7, 2024