
న్యూఢిల్లీ : అన్ని కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. లైవ్ స్ట్రీమింగ్ కోసం రూపొందించిన యాప్‌ను శుక్రవారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. లోటుపాట్లను సవరించి త్వరలో అన్ని బెంచుల విచారణలను లైవ్ స్ట్రీమ్ చేసేందుకు నిర్ణయించింది. ఇటీవల నీట్ యూజీ, కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ సుమోటో కేసులను ముగ్గురు జడ్జిల బెంచ్ లైవ్ స్ట్రీమింగ్ చేసింది.
కాగా, కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆచరణలోకి రాలేదు. రాజ్యాంగ ధర్మాసనం, ప్రజా ప్రయోజనాల పిటిషన్ల విచారణలను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేసింది. కాగా, సుప్రీం కోర్టులో రెండేండ్ల నుంచి రాజ్యాంగ ధర్మాసనం ముందు జరుగుతున్న కేసుల విచారణను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది.