టిఫిన్ తిందామని హోటల్కు వెళ్తే వడలో బల్లి.. వరంగల్లో షాకింగ్ ఘటన

టిఫిన్ తిందామని హోటల్కు వెళ్తే వడలో బల్లి.. వరంగల్లో షాకింగ్ ఘటన

వరంగల్ సిటీ, వెలుగు: టిఫిన్ తిందామని హోటల్కు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. వరంగల్ నగరంలోని కాశీబుగ్గకు చెందిన భేతి రాజు స్థానికంగా ఉన్న అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ కు వెళ్లి వడ ఆర్డర్ ఇచ్చాడు. తీరా తిందామని ప్రయత్నించేలోగా.. వడలో బల్లి కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన రాజు టిఫిన్ సెంటర్ యజమాని సతీశ్ ను ప్రశ్నించగా.. అతడు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

దీంతో రాజు వడ, బల్లి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటల్ వచ్చి తనిఖీలు చేపట్టారు. హోటల్ యజమానికి రూ. 10వేలు ఫైన్ విధించడంతో పాటు వారం రోజుల పాటు హోటల్ ను మూసివేయాలని ఆదేశించారు.