ఓయూ బీఈడీ హాస్టల్ మెస్ చట్నీలో బల్లి

ఓయూ బీఈడీ హాస్టల్ మెస్ చట్నీలో బల్లి

ఓయూ,వెలుగు :  ఓయూ బీఈడీ హాస్టల్ మెస్ లో టిఫిన్ చట్నీలో బల్లి రావడంతో విద్యార్థులు భయాందోళన చెందారు. అప్పటికే అదే చట్నీతో ఇడ్లీలు తిన్న కొందరు విద్యార్థులు భయంతో  హెల్త్​సెంటర్​కు పరుగులు తీశారు. అనంతరం చీఫ్​వార్డెన్​ఆఫీసు వద్ద ఆందోళనకు దిగిన ఘటన బుధవారం ఉదయం జరిగింది.  ఏబీవీపీ నేత రాజు మాట్లాడుతూ బీఎడ్​హాస్టల్​ మెస్​లో పలు సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చట్నీలో బల్లి పడిన చట్నీ తిన్న ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడని, పరిస్థితి విషమించి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే బాధ్యులెవరని ప్రశ్నించారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కేర్​టేకర్​ హుస్సేన్, మెస్​వర్కర్ల నిర్లక్ష్యంగానే జరుగుతుందని ఆరోపించారు.  

హాస్టల్ కేర్​ టేకర్​హుస్సేన్​ నిజామ్​కాలేజీ హాస్టల్ మెస్​కు కూడా ఇన్ చార్జిగా వ్యవహరిస్తూ బీఈడీ హాస్టల్ సమస్యలను పట్టించుకోవడం లేదని, అడిగితే విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 230 మంది విద్యార్థులు ఉన్నారని, మెస్​లో శుభ్రత లేదని కాలేజీ ప్రిన్సిపాల్ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.   ఓయూ హాస్టల్స్​చీఫ్​వార్డెన్​కొర్రెముల శ్రీనివాస్,​ కాలేజీ ప్రిన్సిపాల్ మెస్​ను తనిఖీ చేశారు.  మెస్ లోని నలుగురు సిబ్బందిని మరో హాస్టల్​కు బదిలీ చేశారు. మెస్​ కేర్ టేకర్ హుస్సేన్​పై శాఖాపరమైన చర్యలకు అధికారుల రిపోర్ట్ చేస్తామని చెప్పారు. చట్నీ తయారు చేసే సమయంలోనే బల్లి పడిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా ? అనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చీఫ్​వార్డెన్​కొర్రెముల శ్రీనివాస్​తెలిపారు.