సొసైటీ బ్యాంక్‌లో కోట్ల రూపాయల లోన్లు గోల్ మాల్

సొసైటీ బ్యాంక్‌లో కోట్ల రూపాయల లోన్లు గోల్ మాల్

కుత్బుల్లాపూర్:  మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి సహకార సొసైటీ బ్యాంకులో కోట్ల రూపాయల లోన్లు కాజేశారు. దూలపల్లి ప్యాక్స్ బ్యాంక్ పాలక మండలికి అధికారులు నోటీసులు ఇవ్వడంతో చైర్మన్ గరిసే నరేందర్ రాజు అవినీతి బాగోతం బట్టబయలైంది. సొసైటీ నిధులు అవకతవకలపై పాలకమాండలికి సమన్లు పంపారు అధికారులు. వెంటనే వివరణ ఇవ్వాలని  చైర్మన్ తో పాటు 12మంది సింగిల్ విండో డైరెక్టర్లకు, పాత పాలక మండలి డైరెక్టర్ల కు సమన్లు అందడంతో డైరెక్టర్లు అయోమయానికి గురవుతున్నారు. 

దూలపల్లి(ప్యాక్స్ )ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ టీబిసి 395 సొసైటీ బ్యాంకులో  ఛైర్మెన్ అవినీతికి పాల్పడాడ్డని మేడ్చల్ జిల్లా సహకార అధికారులకు రైతులు పిర్యాదు చేశారు. నిబంధనలు ప్రకారం వ్యవహారించాల్సిన చైర్మన్, తానే సొంతంగా118 ఖాతా నెంబర్ మీద వివిధ రకాలుగా 8 లోన్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also Read:-వాషింగ్ మెషన్ బాగు చేయించలేదని.. ఉరేసుకొని భార్య ఆత్మహత్య

మొత్తం రూ.5 నుంచి 6 కోట్ల రూపాయలు లోన్స్ నిబంధనలు ఉల్లంగించి తీసుకున్నాడని బకాయిలు చెల్లించడం లేదని రైతులు తెలిపారు. భారీగా అవకతవకలు జరిగాయని ఆడిట్ లో మేడ్చల్ జిల్లా సహకార సంఘం అధికారులు గుర్తించారు. ఈ అవకతవకలపై వివరణ ఇవ్వాలని సొసైటీ చైర్మన్ గరిసె  నరేంద్ర రాజుతో పాటు, 12 మంది డైరెక్టర్లకు మేడ్చల్ జిల్లా సహకార సంగం అసిస్టెంట్ రిజిస్టర్ నాగేశ్వర్రావు ఆగస్టు 8న నోటీసులు ఇచ్చారు.