స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు సాధించుకునేందుకు సమిష్టిగా కృషి చేద్దామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ జన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరిగింది. జన సమితి నాయకులు జస్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ ఉపాధ్యక్షులు పియల్ విశ్వేశ్వరరావు, బీసీ నాయకులు నరేందర్ గౌడ్ లు హాజరై ప్రసంగించారు.
ALSO READ | 4 వారాల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి : స్పీకర్ ఆఫీస్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం హామీ ఇవ్వడంతోనే బీసీలంతా కాంగ్రెస్ వెంట నడిచారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక బీసీల కృషి ఎంతగానో ఉందని అన్నారు. జాతీయస్థాయిలో ఒక విధానాన్ని కొనసాగిస్తున్న పార్టీ రాష్ట్ర స్థాయిలో అదే విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జరగబోతున్న తరుణంలో రిజర్వేషన్లు అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది అన్నారు. బీసీల నమ్మకాన్ని చొరగొనాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను అమలు చేస్తున్న నమ్మకం తమకు ఉందని ప్రొఫెసర్ కోదండరామన్నారు.