
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి డబుల్ బెడ్ రూమ్ ఆశావహులు తాళం వేశారు. గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణ కోసం1.26 కోట్లతో 2019లో శంకుస్థాపన చేసినా.. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు.
ఈస్థలాన్ని గ్రామసభ నిర్వహించకుండా వడ్ల మార్కెట్ కోసం కేటాయించాలని సర్పంచ్, కార్యదర్శులు కలెక్టర్ కు సిఫార్సు చేయడాన్ని తప్పుబట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.