లాక్​డౌన్ అక్కర్లే.. రాష్ట్రంలో అన్ని దుకాణాలు ఓపెన్

లాక్​డౌన్ అక్కర్లే.. రాష్ట్రంలో అన్ని దుకాణాలు ఓపెన్
  • మేఘాలయ సర్కారు నిర్ణయం

న్యూఢిల్లీ: రేపటి( సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాలను తెరవాలని, వెహికల్స్ నడపడానికి పర్మిషన్ ఇవ్వాలని మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది. రెండే రెండు కేసులున్న షిల్లాంగ్ లో మాత్రమే సోషల్ డిస్టెన్సింగ్ ప్రొటొకాల్ అమలు చేస్తూ.. ఆటోమొబైల్, స్టేషనరీ దుకాణాలకు అనుమతి ఇవ్వాలని డిసైడ్ చేసింది. రొటేషన్ పద్ధతిలో (ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా) నియంత్రణకు సంబంధించిన పద్ధతులను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ డిప్యూటీ కమిషనర్లను, జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. వాహనాలను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపేలా చూడాలని సూచించారు. ఈ సడలింపులు లేహ్ వ్యూ మార్కెట్, ఖైందైలాద్ మార్కెట్‌కు వర్తించవని స్పష్టం చేశారు. మేఘాలయలో ఇప్పటివరకు 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పది మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు.