
లాక్‌డౌన్ నేపథ్యంలో అని హేయిర్ కటింగ్ కూడా ఇప్పుడు ఎవరి ఇండ్లలో వాళ్లే చేసుకుంటున్నారు . సెలూన్లు మూసివేయడంతో గ్రామాలు, పట్టణాల్లో మగవారు కటింగ్, షేవింగ్చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . దీంతో దువ్వెన.. కత్తెర చేతబట్టి తండ్రికి కొడుకు, కొడుక్కి తండ్రి హేయిర్ కటింగ్ చేసుకుంటున్నారు . కూలీ పనులు చేసుకునేవారి నుంచి మొదలుకొని ఇంజినీర్, పీజీలు చదివి నెలకు రూ.లక్షకు పైగా జీతం తీసుకునే వాళ్లు .. ఉన్నత ఉద్యోగులు.. వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించే వాళ్లు అందరు కూడా ఇప్పుడు సెల్ఫ్ హేయిర్ కటింగ్ చేసుకుంటున్నారు .