
తిరుమల: ఓ వైపు లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దొంగలు తమ పని దర్జాగా చేసుకుంటున్నారు. తిరుమలలో లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో దొంగలు దుకాణాల్లో సరుకులు మాయం చేస్తున్నారు. ఇప్పటికే అనేక దుకాణాలలో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా తిరుమలలో మరో చోరీ జరిగింది. మూసివేసిన దుకాణంలో సీసీ కెమెరా పగలగొట్టి.. దొంగతనానికి పాల్పడింది ఓ పారిశుధ్య కార్మికురాలు. ఈ దృశ్యాలన్నీ మరో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ముఖానికి మాస్క్ ధరించిన మహిళ లోపల ఉన్న సిసి కెమెరాపై రాయితో పగలగొట్టడానికి ప్రయత్నించింది. తర్వాత దుకాణాల్లోని సరుకులను ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన మే-3వ తేదిన జరిగినట్లు సీసీటీవీ పుటేజీ ఆధారంగా తెలసింద. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు షాపు యజమాని. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇంకా ఎన్ని షాపుల్లో చోరీలు జరిగాయో తెలాల్సి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు.