పాపం రెండో తరగతి చిన్నారి.. విండో గ్రిల్లో తల ఇరుక్కుని నరకయాతన.. రాత్రంతా స్కూళ్లోనే

పాపం రెండో తరగతి చిన్నారి.. విండో గ్రిల్లో తల ఇరుక్కుని నరకయాతన.. రాత్రంతా స్కూళ్లోనే

స్కూల్ బెల్లు కొట్టారు.. పరధ్యానంలో ఉందో ఏమో కానీ ఆ చిన్నారి క్లాసులోనే ఉండిపోయింది. పిల్లలందరూ వెళ్లిపోయారు కదా అనుకుని లాక్ చేసి వెళ్లిపోయారు టీచర్లు. పాపం ఆ రెండో తరగతి చిన్నారి రాత్రంతా స్కూల్లోనే ఉండిపోయింది. కిటికీ గ్రిల్స్ నుంచి బయటపడేందుకు ట్రై చేద్దాం అనుకుంది. కానీ గ్రిల్స్ మధ్య తల ఇరుక్కుని రాత్రంతా నరకయాతన అనుభవించింది. ఈ హృదయవిదారక ఘటన శుక్రవారం (ఆగస్టు 22) ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లాలో ప్రభుత్వ స్కూల్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్కూల్ టైమ్ అయిపోయినప్పటికీ.. పిల్లందరూ ఇళ్లకు చేరుకున్నా తమ కూతురు ఇంకా రాలేదని పేరెంట్స్ ఆందోళన చెందారు. ఇరుగుపొరుగు వారంతా గ్రామం మొత్తం జల్లెడపట్టారు. కానీ ఎక్కడా పాప జాడ దొరకలేదు. 

గురువారం (ఆగస్టు 21) స్కూల్ విడిచిన తర్వాత ఆ చిన్నారి క్లాసులోనే చిక్కుకుపోయింది. కిటికీ గ్రిల్స్ నుంచి తప్పించుకుందామని ప్రయత్నించి తల ఇరుక్కుపోవడంతో రాత్రంతా స్కూళ్లోనే ఉండిపోయింది. పేరెంట్స్ ఎంత వెతికినా పాప కనిపించలేదు. మరుసటి రోజు (శుక్రవారం) చిన్నారి స్కూళ్లోనే ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. 

చిన్నారి తల గ్రిల్స్ లో ఇరుక్కుపోవడంతో రిస్క్యూ టీమ్ సహాయంతో విడిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాపకు చికిత్స అందించిన వైద్యులు.. ఆ చిన్నారి కండిషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. చిన్నారి కిటికీ గ్రిల్స్ లో ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి స్కూల్ స్టాఫ్ పైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

వంటమనిషి రానందునే:

సంజితా అనే స్కూల్ టీచర్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు వంట మనిషి స్కూల్ కు తాళం వేస్తుంటాడు. భారీ  వర్షాల కారణంగా ఆరోజు రాలేదు. దీంతో 4 గంటల 10 నిమిషాలకు స్కూల్ తాళం వేసే ముందు.. ఇద్దరు 7వ తరగతి స్టూడెంట్స్ ను అన్ని క్లాసుల తాళాలు వేయమని చెప్పాం.  రెండవ తరగతి చిన్నారి డెస్క్ కింద పడుకుని ఉంది. అది చూసుకోకుండా స్టూడెంట్స్ డోర్ లాక్ చేశారు.. అని టీచర్ చెప్పారు.