వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

 వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని  వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో2024 ఏప్రిల్  04వ తేదీన రాహుల్ వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.   నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్..  భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో  రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, దీపా దాస్మున్షి ఉన్నారు.  

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..  నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రజ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌ను దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాన‌న్నారు. పార్టీలు, వర్గాలు, వయస్సుతో సంబంధం లేకుండా వాయనాడ్‌లోని ప్రతి ఒక్కరు తనపై  ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూపించారని .. తనను స్వంత వ్యక్తిగా చూశారన్నారని రాహుల్ చెప్పుకొచ్చారు.  

ALSO READ :- Ruhani Sharma Agra: వామ్మో రుహాని శర్మ బోల్డ్ ఫిల్మ్ ..ఇంత ఘాటు సీన్స్ ఎలా ?

2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఇక్కడి నుంచి రాహుల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఇక్కడి నుండే రాహుల్ పోటీ చేస్తు్న్నారు.  కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అభ్యర్థి రాజా కూడా వాయనాడ్‌కు నామినేషన్ దాఖలు చేశారు.