ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘AA23’. వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఆ అంచనాలే వేరు. అయితే ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ.. లోకేష్ కో రైటర్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు.
రైటర్ రత్న కుమార్ మాట్లాడుతూ, “ఇది నిజమైన పాన్-ఇండియన్ సినిమా అని నేను భావిస్తున్నాను. అది నటులు, పాత్రలు లేదా లొకేషన్ల వల్ల కాదు. AA 23 మూవీ అంతర్జాతీయ స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్న స్టోరీ. అందుకే ఈ మాట చెప్తున్నా. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ గారితో మూడు వారాల పాటు చర్చించాం. ఆయనతో పని చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే రెండో వారంలో పనులు ప్రారంభమవుతాయి” అని రత్న కుమార్ తెలిపారు.
థీమ్ మ్యూజిక్ తోనే రికార్డుల వేట!
సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. బన్నీ గుర్రాన్ని పట్టుకుని ఉన్న సిల్హౌట్ ఇమేజ్, సింహంలా ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే రీల్స్‌లో ట్రెండ్ అవుతూ లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంది.
►ALSO READ | Mahesh Babu: మెక్సికో ఈవెంట్‌లో 'వారణాసి' స్పెషల్ వీడియో.. గ్లోబల్ బాక్సాఫీస్ టార్గెట్‌గా రాజమౌళి మాస్టర్ ప్లాన్ !
అంతేకాకుండా అల్లు అర్జున్- దర్శకుడు లోకేష్ పంచుకున్న సెల్ఫీ ఫోటో వీపరీతంగా వైరల్ అయింది. ఆ క్షణం AA23 థీమ్ మ్యూజిక్‌కు సంబంధించిన ఒక మిలియన్ రీల్స్‌ను వారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే “Numbers never lie, add it up, that’s me” అనే లైన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ లైన్ ‘Pushpa 2’ ద్వారా వచ్చిన భారీ కలెక్షన్లను సూచించేలా ఉంది. మాటల్లో చెప్పకుండానే, ఈ థీమ్ ద్వారా అల్లు అర్జున్ బాక్సాఫీస్‌లో ఉన్న స్థానాన్ని బలంగా తెలియజేస్తుంది. అయితే, “AA23 థీమ్” సంగీతం కేవలం స్టైల్ మాత్రమే కాదు, దానిలో ఒక బలమైన సందేశం ఉందని టాక్.
ఎవరీ ఈ రత్న కుమార్:
రత్న కుమార్ మొదట్లో డైరెక్టర్. ఇప్పుడు స్క్రీన్ రైటర్. 2017లో విడుదలైన తమిళ మూవీ మేయాధ మాన్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. 2019లో అమలా పాల్ నటించిన ఆడై (తెలుగులో ఆమె) చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, సమాజంలోని ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది.
తర్వాత స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి కో రైటర్ గా పనిచేస్తున్నాడు. అలా మాస్టర్ సినిమాకు సహ రచయితగా పనిచేశాడు. ఆ తరువాత విక్రమ్, లియో, కూలీ వంటి సినిమాలకు కో-రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా తన ముద్ర వేశాడు. ప్రస్తుతం రత్న కుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న AA23తో పాటు, సూర్య నటిస్తున్న కరుప్పు, కార్తి యొక్క సర్దార్ 2 వంటి ప్రాజెక్టులపై పని చేస్తున్నాడు. ప్రస్తుతం '29' అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో మళ్లీ దర్శకుడిగా వస్తున్నాడు. మే 8న మూవీ రిలీజ్ కానుంది.
భారీ రెమ్యునరేషన్..
ఈ ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్ సుమారు రూ.75 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది లోకేష్ కలల ప్రాజెక్ట్ అయిన 'ఇరుంబుకై మాయావి' (Irumbukai Maayavi) అనే సైన్స్ ఫిక్షన్ కథ ఆధారంగా తెరకెక్కుతోందని, అందుకే బన్నీకి సరిపోయేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారని టాక్ విపిస్తోంది. అయితే ఈ సినిమాలో నటీనటులను పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

