కుక్కలకూ బార్‌‌‌‌.. ఓనర్‌కు, కుక్కకు ఒకే డ్రింక్

కుక్కలకూ బార్‌‌‌‌.. ఓనర్‌కు, కుక్కకు ఒకే డ్రింక్

పెంపుడు కుక్కల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కొంతమంది. ఇంట్లో తమతోపాటు సమానంగా చూస్తారు. సోఫాలు, బెడ్‌‌పై తమ పక్కనే ఉంచుకుంటారు. బయటికి వెళ్లేటప్పుడు చాలాసార్లు వాటిని వెంట తీసుకెళ్తారు. మరి బార్‌‌‌‌కు వెళ్లేటప్పుడు? ఛాన్సే లేదనుకుంటారేమో! బార్‌‌‌‌కు తీసుకెళ్లడం ఇంకెక్కడైనా సాధ్యం కాదేమో. కానీ, లండన్‌‌లో మాత్రం కుక్కపిల్లల్ని బార్‌‌‌‌కు తీసుకెళ్లొచ్చు. అక్కడ వాటికి కావాల్సిన డ్రింక్‌‌, ఫుడ్‌‌ ఆర్డర్‌‌‌‌ చేయొచ్చు.

లండన్‌‌లోని హ్యాక్నీ విక్‌‌ ఏరియాలో ఉంది ‘పప్‌‌టెయిల్స్‌‌’ అనే బార్‌‌‌‌. కుక్కలకు కూడా డ్రింక్‌‌ సర్వ్‌‌ చేయడం ఇక్కడి స్పెషాలిటీ. కుక్కల్ని టేబుల్‌‌పైన కూర్చోబెట్టుకుని డ్రింక్స్‌‌ తాగించొచ్చు. అవసరమైతే నేలపై కూడా వాటికి సర్వ్‌‌ చేస్తారు. ఓనర్స్‌‌ తమ పెంపుడు కుక్కలతో వచ్చి మందు తాగొచ్చు. యజమాని, పెట్స్‌‌ కలిసి డ్రింక్స్‌‌ ఎంజాయ్‌‌ చేయొచ్చు. అలాగని వాటికి ఆల్కహాలే తాగించక్కర్లేదు. ఫ్రూట్‌‌ జ్యూస్‌‌లతోపాటు, కాక్‌‌టెయిల్స్‌‌, మాక్‌‌టెయిల్స్‌‌ వంటివి స్పెషల్‌‌గా వాటికోసమే తయారుచేస్తారు. కొన్ని డ్రింక్స్‌‌ యజమాని, పెట్స్‌‌ కలిసి తాగే ఫెసిలిటీ కూడా ఉంది. ఓనర్‌‌‌‌, కుక్క.. ఒకే డ్రింక్‌‌ షేర్‌‌‌‌ చేసుకోవచ్చు కూడా. వాటికి మంచి ఫుడ్‌‌ ఆర్డర్‌‌‌‌ ఇవ్వొచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉండటంతో ఈ బార్‌‌‌‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. చాలామంది తమ డ్రింకింగ్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌గా పెంపుడు కుక్కల్ని తెచ్చుకుంటున్నారు. కుక్కలతో టైం స్పెండ్‌‌ చేయడం వల్ల యాంగ్జైటీ వంటి మెంటల్‌‌ ఇష్యూస్‌‌ తగ్గుతాయని అక్కడివాళ్లు అంటున్నారు.