భారీ వర్షాలతో లండన్ నగరం జలమయం

భారీ వర్షాలతో లండన్ నగరం జలమయం
  • ఒకేరోజు 16 సెంటీమీటర్ల వర్షం.. అనేక వీధుల్లో నడుములోతు నీళ్లు..  
  • నీట మునిగిన 8 రైల్వే స్టేషన్లు

లండన్: నిన్న మొన్నటి వరకు తీవ్రమైన ఎండలతో అల్లాడిన యూరప్ దేశాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకేరోజు రికార్డు స్థాయిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం లండన్ నగరంలో కురిసింది. కుండపోత వాన దెబ్బకు లండన్ నగరం జలమయం అయింది. అనేక వీధుల్లో నడుంలోతు నీళ్లలో మునిగిపోయాయి. దాదాపు 35వేలకు పైగా ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. అంతేకాదు 8 ట్యూబ్ స్టేషన్లను వరదనీరు ముంచెత్తింది. 
భారీ వర్షాలకు బయట వీధుల్లో రోడ్లు ఎక్కడా కనిపించని పరిస్థితి. అనేక వీధుల్లో మోకాలు లోతు మొదలు నడుము లోతు నీళ్లు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాననీటి ప్రవాహంలో భారీ ఎత్తున వాహనాలు కొట్టుకుపోతుండడం కనిపిస్తోంది. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో లండన్ వైద్య ఆరోగ్యశాఖ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వైద్య శాఖ హెచ్చరింస్తోంది. లండన్‌ నగరం విస్తరణ కోసం అనేక చెరువులు, నదులను పూడ్చేశారని.. అందుకే ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.