కేజీ దొండకాయలు రూ.900.. ఎందుకంత రేటు!

కేజీ దొండకాయలు రూ.900.. ఎందుకంత రేటు!

కేజీ దొండకాయలు ( పర్వాల్​) ధర ఎంత ఉంటుంది..? మహా అయితే రూ.30 ఉంటుందేమో కదా. కానీ... ఓ చోట మాత్రం రూ.900 నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. లండన్ లో కేజీ దొండకాయల ధర రూ.900 అట. విదేశాల్లో స్థిరపడిన ఓ భారతీయుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది నెట్టింట వైరల్ గా మారింది.

ఈ రోజుల్లో చాలా మంది  చదువుకోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతూ ఉంటారు. అలా వెళ్లి.. మన ఫుడ్ దొరకక చాలా మంది ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  ఓ యువకుడు లండన్ లో స్థిరపడగా.. అక్కడ కూరగాయలు కొనడానికి వెళ్లాడట. అక్కడ దొండకాయల ఖరీదు చూసి షాకయ్యాడు. వెంటనే సోషల్ మీడీయాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ పోస్ట్‌ను ఓంకార్ ఖండేకర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో లండన్‌లోని మార్కెట్‌లో ఉన్న కొన్ని కూరగాయల ఫోటోలను షేర్ చేశాడు. పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, , కోడిగుడ్లు కూడా అందులో  ఉన్నాయి. అయితే అక్కడ.. కిలో దొండకాయల ధర 8.99 పౌండ్లు, అంటే దాదాపు రూ. 919. అక్కడి ధర విని.. అందరూ షాకయ్యారు.అంత ధరా అంటూ.. అందరూ షాకయ్యారు. అయితే... ఓ నెటిజన్ మాత్రం.... రోమ్ లో ఉంటే రోమ్ లో ఉన్నట్లే ఉండాలని.. దొండకాయలు తినకూడదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.