
శ్రావణమాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో చేసే వ్రతాలకు.. నోములకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక శివుడికి కార్తీక మాసం తరువాత అత్యంత ఇష్టమైన నెల శ్రావణమాసం. శ్రావణ సోమవారాలకు ఎంతో విశిష్టత ఉందని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం ...సంకట హర చతుర్థి రెండూ కలసి ఉంటే పురాణాల ప్రకారం ఆరోజు ( జులై28) చాలా శక్తివంతమైన రోజు. అలాంటి రోజున శివుడిని.. వినాయకుడిని పూజిస్తే ఎంతో ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
శ్రావణ మాసంలో శివ కేశవులను లక్ష్మిదేవి మంగళ గౌరీ లను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, జూలై 28 కోరికలను కోరుకోవడానికి.. వాటిని నెరవేర్చుకోవడానికి శక్తివంతమైన రోజు. దీనికి రెండు కారణాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ఈ ఏడాది జులై 28 శ్రావణ మాసం మొదటి సోమవారం ... అంతేకాదు సంకటహర వినాయక చవితి. ఈ రెండు ఒకే రోజు రావడం చాలా ప్రత్యేకమని పురాణగ్రంథాల ద్వారా తెలుస్తుంది. జూలై 28న చతుర్థి తిథి జూలై 27న రాత్రి 10:40 గంటలకు ప్రారంభమై జూలై 28న రాత్రి 11:24 గంటలకు ముగుస్తుంది. ఈ నేపధ్యంలో సంకహర వినాయక చవితిని జూలై 28న జరుపుకోవాల్సి ఉంటుంది.
ALSO READ : జ్యోతిష్యం : జులై 21న మూడు యోగాలు.. శివకేశవులను పూజించాలి.. ఐశ్వర్యంవృద్ది..కష్టాల నుంచి విముక్తి
శ్రావణ మాసంలోని ప్రతి రోజూ ప్రవిత్రమైనవే.. అయితే సోమవారాలను శివుడిని పూజించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అంతే కాదు సంకహర వినాయక చవితి అనేది గణేశుడిని పూజించే పండుగ. జీవితంలోని అన్ని కష్టాలను, అడ్డంకులను తొలగించే దేవుడు వినాయకుడు.
- వివాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటే.. అలాంటి వారు జులై 28న శివుడికి రుద్రాభిషేకం చేసి.. వినాయకుడికి గరిక సమర్పించాలి.
- వివాహం అయి చాలాకాలం అయినా సంతానం కలుగకపోతే అలాంటి దంపతులు.. పరమేశ్వరుడిని దర్శించి.. పాలతో అభిషేకం చేసి శివుడికి నాగాభరణం సమర్పిస్తే నాగదోషం పోయి సంతానం కలుగుతుంది
- ఏ పని తలపెట్టినా కలసిరాకపోవడం...అశాంతి కలగడం .. మానసిక ఆందోళన ఉన్నట్లయితే లింగాష్టకం పఠించి...వినాయకుడికి లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చి.. కేజీం పావు.. బియ్యాన్ని దానం చేయాలి.
- జులై 28న శివుడిని.. వినాయకుడిని పూజిస్తే వ్యాధులు, దోషాలు, పితృ శాపాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
- చంద్రుడు, రాహువు, కేతువు వంటి గ్రహాలను ప్రభావితం చేసే గ్రహ బాధలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
- స్టూడెంట్స్ పరీక్షలలో మంచి ఫలితాలకోసం.., ఉన్నత విద్యలో మంచి ఫలితాలు మొదలైన వాటి కోసం ఈరోజు శివుడు, గణపతిని ప్రార్థించవచ్చు.
- తండ్రి తనయుడు మీ కోరికలు విని.. త్వరగా మీ కోరికలను తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.