
కీసర, వెలుగు: కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లిలో శనివారం రాత్రి సీతా రామాంజనేయ దేవాలయం పక్కన గల హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఘటనను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో యువజన సంఘాల నాయకులు అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీతారామాంజనేయ దేవాలయానికి వచ్చారు. కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డితో మాట్లాడారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.