నిర్జల ఏకాదశి జూన్​ 18 :  ఇలా చేస్తే  లక్ష్మీనారాయణులు  ప్రసన్నం...ఆ ఇంట్లో డబ్బు వర్షమేనట...

నిర్జల ఏకాదశి జూన్​ 18 :  ఇలా చేస్తే  లక్ష్మీనారాయణులు  ప్రసన్నం...ఆ ఇంట్లో డబ్బు వర్షమేనట...

ఏకాదశి... హిందువులకు  ఈ రోజుకు మించిన తిథి ఏదీ ఉండదు.  సాధారణంగా ప్రతి ఏకాదశికి పూజలు చేయడం.. ఉపవాసం ఉండటం.. దగ్గరలోని దేవాలయం దర్శించడం.. ఇలా చేస్తుంటారు. కాని జ్యేష్ఠ మాసం..శుక్ష పక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టత ఉంది.  ఈ రోజున ( జూన్​ 18) ఉదయాన్నే.. తులసి మొక్కను పూజించి.. లక్ష్మీ నారాయణులను పూజిస్తే .. ఆ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుందని వేద పండితులు చెబుతున్నారు. కనుక ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆచారాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పొడవునా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకోనున్నారు. 

 • నిర్జల ఏకాదశి రోజు బ్రాహ్మీ మూహుర్తంలో నిద్రలేవాలి. తలస్నానం చేసి, పూజగదిని శుభ్రం చేసుకొవాలి. మార్కెట్ లో లభించే ప్రత్యేకమైన పూలు, పండ్లను తీసుకుని వచ్చి దేవుడికి నివేదించాలి. శ్రీ మహ విష్ణువు అలంకార ప్రియుడిగా చెబుతుంటారు. అందుకే ఆయనను ప్రత్యేకమైన పూలతో డెకోరేట్ చేయాలి.
 • నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని, లక్ష్మీదేవిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. విష్ణు భగవానుడుకి పసుపును సమర్పించాలి. ఉపవాసం పాటించి దానధర్మాలు చెయ్యాలి. అప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం, దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.
 • నిర్జల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత చందన తిలకం దిద్దాలి. దీనితో పాటు ‘ఓం ఆః అనిరుద్ధాయ నమః.’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని మత విశ్వాసం.
 • వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే నిర్జల ఏకాదశి రోజున ఇంట్లోని తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించాలి. దీనితో పాటు తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షణ చేయాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
 • జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి నిర్జల ఏకాదశి ఉత్తమ పర్వదినం. నిర్జల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఖీర్ లో తులసి దళాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలోని ప్రతి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం.
 • ఎవరి జాతకంలో ఏ విధమైన దోషం ఏర్పడి ఉంటే.. దానిని పోగొట్టుకోవడానికి నిర్జల ఏకాదశి రోజున నీరు, పసుపు పండ్లు, బట్టలు, మామిడి పండ్లు, పుచ్చకాయ లేదా పంచదార మొదలైన వాటిని బ్రాహ్మణుడుకి లేదా పేదవారికి దానం గా ఇవ్వండి. ఇలా చేయడం చాలా పవిత్రమైనది. పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది.
 • నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లేదా రోజంతా ఉపవాసం చేసిన సమయంలో ‘ఓం నమో వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.
 • నిర్జల  ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు జల దానం చేసినా, అన్న దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
 • విష్ణు దేవాలయంలో పూజలు, హోమాలు చేయించే మంచి ఫలితం ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి, (లేదా వెన్న) తేనె, చక్కెరతో విష్ణుమూర్తికి అభిషేకం చేయించాలి. వస్త్రాలు, ధాన్యాలు, గొడుగులు, చేతి విసనకర్రలు, బంగారం దానం చేయాలి. 
 • ఏకాదశి తిథిరోజు తెల్లని పూలు,  తులసీలతో మాలలు చేసి శ్రీ మహవిష్ణువుకు సమర్పించాలి. ఈ రోజున చాలా మంది భక్తులు ఉపవాసం వ్రతం కూడా చేస్తారు. ఉపవాసం చేయలేని వారు, ఏక భుక్త  వ్రతం కూడా చేయోచ్చని పండితులు చెబుతుంటారు.
 • ఈరోజున ఏ  వ్రతం, ఎలాంటి దానాలు చేసిన వందరెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందని పురాణాలలో చెప్పబడింది.. అందుకే నిర్జల ఏకాదశి రోజున.. పేదలకు వస్త్రదానం, అన్నదానం చేయాలి. తమకు ఉన్న శక్తి మేరకు పేదవాళ్లకు పెళ్లిలో సహయం చేయాలి..
 • బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం.     
 • ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీ దేవీ అనుగ్రహంతో అఖండ ధనయోగంతో పాటు, శీఘ్రంగా పెళ్లి కుదురుతుందని జ్యోతిష్య పండితులుచెబుతుంటారు. చాలా మంది యువత ఇటీవల కాలంలో పెళ్లిళ్లు కుదరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు ఈ రోజున ఈ పరిహరాలు పాటిస్తే మంచి జరుగుతుందని పండితుల అభిప్రాయం.
 • ఏకాదశి రోజున శ్రీ సత్యనారాయణ వ్రతను భక్తి, శ్రద్ధలతో చేస్తే.. వారికి జీవితంలో ఏ విషయాల్లోను  కూడా .. తక్కువ ఉండదని పండితులు చెబుతున్నారు.  ఇంకా.. రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయాలి. నల్ల చీమలకు చక్కెర లేదా బెల్లంను ఆహరంగా వేయాలి. పేదలకు , స్వీట్లు, పండ్లను పంచి పెట్టాలి.

ఆచరించాల్సిన నియమాలు

 • ఏకాదశి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస నియమాలను పాటించాలి. కానీ ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఏకాదశి రోజున అన్నం, పప్పులు, బెండకాయలు, ముల్లంగి, శనగలు తినకూడదు. ఈ నియమాన్ని ఆచరించిన వారికి కూడా ఉపవాసం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
 • ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి అన్నీ తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు, రోజంతా తక్కువ మాట్లాడాలి. వీలైతే మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. అబద్ధాలు చెప్పకూడదు. కోపం తెచ్చుకోకండి, ఇతరులతో వాదించకండి. రాత్రి పూట విష్ణువు స్తోత్రాలు జపించాలి. ఏకాదశి ఉపవాస సమయంలో నీరు త్రాగడం నిషేధించబడింది. అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు. అవసరమైతే మీరు అనారోగ్యంతో ఉంటే నీరు తాగవచ్చు, పండ్లు తినవచ్చు. ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు. శుద్ధి సమయంలో మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు ఆచమనం తప్ప నీరు త్రాగకూడదు.

  దానం చేయాల్సిన వస్తువులు ఇవే...
 • నిర్జల ఏకాదశి రోజున అన్నం, వస్త్రాలు, గోవు, నీరు, మంచం, గొడుగు , బంగారం, ధనం దానం  చేయాలి. కానీ వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీరు నిండిన కుండ దానం చేయడం ఉత్తమం. మంచి, యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదుకలు దానం చేయడం కూడా మంచిది.

నిర్జల ఏకాదశి వ్రత కథ

పాండవ సోదరులలో భీముడు ఆహార ప్రియుడు. ఒక్కపూట కూడా భోజనం చేయకుండా ఉండలేడు. ఒకసారి తన సోదరులు, తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారని కానీ నెలలో రెండు రోజుల కూడా తాను ఉపవాసం ఉండడం చాలా కష్టంగా ఉంటుందని భీముడు వేదవ్యాసుడికి చెప్తాడు. స్వర్గాన్ని పొందడానికి మోక్షమార్గం లభించేందుకు సంవత్సరానికి ఒకసారి ఆచరించే ఉపవాసం ఏముందని భీముడు వేద వ్యాసుడిని అడిగాడు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా ఉపవాసం నుండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, దానం చేస్తే మోక్షం లభిస్తుందని వ్యాసుడు చెప్పారు. అలా భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించాడు. అందుకే ఈ ఏకాదశికి భీముని ఏకాదశి, పాండవ ఏకాదశి అనే పేరు కూడా ఉంది.