యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. గత 36 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను కొండ కింద ఉన్న వ్రత మండపం హాల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కించారు. హుండీల ద్వారా ఆలయానికి మొత్తం రూ.2,48,53,666 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు.
64 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. అలాగే 312 అమెరికా డాలర్లు, 55 ఇంగ్లాండ్ పౌండ్లు, 940 కెనడా డాలర్లు, నేపాల్ 55, ఆస్ట్రేలియా 40, ఖతార్ 2, మలేషియా 28, సింగపూర్ 9, సౌదీ అరేబియా 225, ఒమన్ అర రియల్‌తో పాటు 10,400 బైసా, కెన్యా 100, స్వీడన్ 20, మొజాంబిక్ 50,000 కరెన్సీ వచ్చినట్లు ఈవో తెలిపారు.
