
- రాముని సేవలో సినీ డైరక్టర్ బోయపాటి శ్రీనివాసరావు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. విశేష అలంకరణలు చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లారు.
నిత్య కల్యాణం చేశారు. ప్రముఖ సినీడైరక్టర్ బోయపాటి శ్రీనివాసరావు, జీసీసీ చైర్మన్ తిరుపతి, అరకు ఎమ్మెల్యే రేగం మచ్చలింగం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. వారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులుఆశీర్వచనం ఇచ్చారు. ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. సాయంత్రం రామయ్యకు దర్బారు సేవ జరిగింది.