లారీ ఢీకొని బైకర్ మృతి.. దూలపల్లి ఛర్మాస్ రోడ్డులో ఘటన

లారీ ఢీకొని బైకర్ మృతి.. దూలపల్లి ఛర్మాస్ రోడ్డులో ఘటన

జీడిమెట్ల, వెలుగు: రెడీమిక్స్​ లారీ ఢీకొని ఓ బైకర్​ మృతిచెందాడు. అల్వాల్​లోని యాదమ్మనగర్ కు చెందిన కిషన్​ చంద్(38) గుండ్లపోచంపల్లిలోని ఫార్చూన్​ ఆర్ట్​ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్​ గా పనిచేస్తుంటాడు. మంగళవారం సాయంత్రం ఫ్యాక్టరీలో పని ముగించుకుని బైక్​పై ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమంలో దూలపల్లి ఛర్మాస్​ రోడ్డులోని ఇండియన్​ ఆయిల్​ పెట్రోల్​ బంక్​ వద్దకు రాగానే ఓ రెడీమిక్స్​ లారీ వెనక నుంచి అతని బైక్​ను ఢీకొట్టింది. అతడు కిందపడిపోగా పైనుంచి లారీ వెళ్లడంతో స్పాట్​లో చనిపోయాడు.