12 ఏ రైల్వే కాలనీ లాంటి థ్రిల్లర్‌‌‌‌కు వర్క్ చేయడం కొత్తగా ఉంది

12 ఏ రైల్వే కాలనీ లాంటి థ్రిల్లర్‌‌‌‌కు వర్క్ చేయడం కొత్తగా ఉంది

ఇప్పటివరకు తాను పనిచేసిన సినిమాల్లో ‘12ఎ రైల్వే కాలనీ’ డిఫరెంట్ జానర్ సినిమా అని సంగీత దర్శకుడు భీమ్స్‌‌ సిసిరోలియో అన్నారు.  అల్లరి నరేష్ హీరోగా నాని కాసరగడ్డ దర్శకత్వంలో  శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భీమ్స్‌‌ మాట్లాడుతూ ‘ఇలాంటి ఓ థ్రిల్లర్‌‌‌‌కు వర్క్ చేయడం కొత్తగా ఉంది.  దీనికి నేనే వర్క్ చేశానా అనిపించింది.  కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది. 

ఇలాంటి జానర్ లో నేను సినిమా చేయగలననే నమ్మకాన్ని ఈ ప్రాజెక్టు కల్పించింది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేసేలా ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నా.  ఇందులో రెండు మెలోడీ సాంగ్స్‌‌ ఉన్నాయి.  అవి రెండూ కథ నుంచే పుడతాయి.  నరేష్‌‌ గారి సినిమాకు మరోసారి వర్క్ చేయడం సంతోషంగా ఉంది.  

అలాగే వరుస డిఫరెంట్‌‌ వేరియేషన్స్‌‌ ఉన్న సినిమాలకు వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.  ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకర వరప్రసాద్ గారు, డెకాయిట్, టైసన్ నాయుడు, భోగి, ఫంకీ చిత్రాలకు వర్క్ చేస్తు న్నాను” అని చెప్పారు.