జిల్లా మత్స్యకార సంఘాలకు పర్సన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్లను కొనసాగించండి..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

జిల్లా మత్స్యకార సంఘాలకు పర్సన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్లను కొనసాగించండి..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: జిల్లాల మత్స్యకార సహకార సంఘాలకు పిటిషనర్లను పర్సన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్​ లుగా కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. జిల్లా మత్స్యకార సహకార సంఘాలకు పర్సన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్​లను ప్రభుత్వం నేరుగా నియమించేలా జారీ చేసిన జీవో 60ను సవాల్ చేస్తూ బుస్సా మల్లేశం మరో 9 మంది హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. 

దీనిని హైకోర్టు విచారించింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 9 జిల్లాల సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని చెప్పడంతో ఈ జిల్లాలకు పిటిషనర్లను పర్సన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్​లుగా కొనసాగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.