‘ఇందిరమ్మ’ నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

‘ఇందిరమ్మ’ నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​ చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  బుధవారం కలెక్టరేట్​లో  భిక్కనూరు, మద్నూర్​, ఎల్లారెడ్డి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో  మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.  ఇసుక, మొరం కొరత ఏర్పడకుండా చూడాలన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర మదన్మోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​ రవితేజ తదితరులు పాల్గొన్నారు. 

చీరల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి

 జిల్లాలో చీరల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం సీఎం రేవంత్​రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ..   డిసెంబర్ 9 వరకు చీరల పంపిణీ జరుగుతుందన్నారు.  వివాదాలకు తావులేకుండా చీరల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలన్నారు.  సివిల్ సప్లయ్ అధికారుల డేటా ప్రకారం 18 ఏండ్లు పైబడిన వాళ్లు జిల్లాలో  3,11,922 మంది మహిళలు అర్హులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్​, మదన్మోహన్,  డీఆర్డీవో సురేందర్​, డీపీవో మురళి, మహిళ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.