భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి హుండీని బుధవారం లెక్కించారు. రూ.1,61,02,694ల నగదు, 141 గ్రాముల మిశ్రమ బంగారం, 850 గ్రాముల మిశ్రమ వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు ఈవో దామోదర్‌రావు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యాక నగదును బ్యాంక్ ఆఫీసర్లకు అప్పగించారు.
