నిజామాబాద్ మున్సిపల్ లో ఆఫీస్లో ఏసీబీ సోదాలు

నిజామాబాద్ మున్సిపల్ లో ఆఫీస్లో ఏసీబీ సోదాలు

 

  • టౌన్ ప్లానింగ్ సెక్షన్​లో ఫైల్స్ తనిఖీ

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో బుధవారం డీఎస్పీ శేఖర్​గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ సోదాలు కొనసాగాయి. థర్డ్​ ఫ్లోర్​లోని టౌన్​ ప్లానింగ్ సెక్షన్​లో ఏసీబీ సిబ్బంది డోర్లు క్లోజ్ చేసి తనిఖీలు చేశారు.  ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగించారు. 

టౌన్​ ప్లానింగ్​లో పని చేస్తున్న ఇద్దరు ఏసీపీలు, ఒక టీపీవో, 2 టీపీఎస్​లు​, ఐదుగురు టీపీబీవోలు, చైన్​మెన్​, కంప్యూటర్​, సెక్షన్ అసిస్టెంట్​తో పాటు అటెండర్​ను కూడా పలు అంశాలపై ప్రశ్నించారు. టౌన్​ ప్లానింగ్​ సెక్షన్​ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ సెక్షన్​, అకౌంట్స్​, రెవెన్యూ, ఆడిట్​ విభాగం స్టాఫ్​ రెగ్యులర్​ టైంకంటే ముందే ఇండ్లకు వెళ్లిపోయారు. సోదాలు సాఫీగా కొనసాగించడానికి లోకల్​ పోలీస్​లతో బందోబస్తు ఏర్పాటు చేయించారు.