పట్టుకొని చంపేస్తున్నరు.. మావోయిస్టుల ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: కూనంనేని

పట్టుకొని చంపేస్తున్నరు.. మావోయిస్టుల ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: కూనంనేని

హైదరాబాద్, వెలుగు: పోలీసులు ఎన్ కౌంట‌‌‌‌‌‌‌‌‌‌ర్ల పేరుతో మావోయిస్టులను పట్టుకొని చంపేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఈ ఎన్ కౌంట‌‌‌‌ర్లపై   సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు. ఒక దొంగను చంపినా సుమోటోగా కేసులను స్వీకరించే కోర్టులు.. మావోయిస్టుల విషయంలో మాత్రం స్పందించడం లేదని.. న్యాయస్థానాల మౌనం నష్టదాయకమన్నారు.హైదరాబాద్ ముక్దూం భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘మావోయిస్టుల ఏకపక్ష హత్యల’’పై వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో గురువారం  రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలి పారు. హిడ్మా రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉంటే, సంప్రదింపులు జరపకుండా, ఎన్ కౌంట‌‌‌‌ర్ పేరుతో హత్య చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.