సమస్యల సుడిగుండంలో ఓయూ.. పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయాలని డిమాండ్

సమస్యల సుడిగుండంలో ఓయూ.. పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయాలని డిమాండ్

ఓయూ, వెలుగు: ఓయూ స్టూడెంట్ ఎజెండాను అమలు చేయాలని, సీఎం రేవంత్​రెడ్డి డిసెంబర్ పర్యటన వరకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని జార్జిరెడ్డి పీడీఎస్​యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్.నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. బుధవారం యూనియన్​ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ కాలేజీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ స్టూడెంట్ ర్యాలీ నిర్వహించారు.

 అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు.  ఓయూ విద్యార్థులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడి సమస్యలు తీరడం లేదన్నారు. కార్యక్రమంలో క్రాంతి, తిరుపతి, మధు, విజయ్, మేనక, గాయత్రి ,రమ్య, సింధు పాల్గొన్నారు.