ఆసిఫాబాద్ జిల్లాలో కంకర అన్ లోడ్ చేస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్ లో మృతి చెందిన లారీ డ్రైవర్

  ఆసిఫాబాద్ జిల్లాలో కంకర అన్ లోడ్ చేస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్ లో మృతి చెందిన లారీ డ్రైవర్
  •     ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన 

కాగజ్ నగర్, వెలుగు: లారీలోని కంకరను అన్ లోడ్ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి డ్రైవర్ స్పాట్ లో చనిపోయిన ఘటన ఆసిఫాబాద్ ​జిల్లాలో జరిగింది.  పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కాగజ్‌‌‌‌నగర్‌‌ మండలం చింతగూడకు చెందిన డ్రైవర్ కోట్రంగి రాములు(43), తన సొంత లారీలో సోమవారం రాత్రి కౌటాల మండలం ముత్యంపేట వద్ద క్రషర్  నుంచి కంకర లోడ్ చేసుకుని సొంతూరికి వెళ్లాడు. 

అర్ధరాత్రి కంకర అన్ లోడ్ చేసేందుకు హైడ్రాలిక్ ను పైకి ఎత్తడడంతో విద్యుత్ తీగలను తాకడంతో  లారీకి కరెంటు షాక్ రావడంతో  డ్రైవర్ రాములు వెంటనే కిందకు దూకాడు. మంటల నుంచి లారీ తీసుకెళ్లేందుకు యత్నించగా షాక్ కొట్టి స్పాట్ లో చనిపోయాడు. రాములు మృతితో సొంతూరులో విషాదం నెలకొంది.  మృతుడి భార్య చిలుకబాయితో ఇద్దరు కొడుకులు సాగర్, సందీప్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.