అట్టుడుకుతున్న లాస్ఏంజెల్స్.. అక్రమ వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ మూడోరోజూ కొనసాగిన ఆందోళనలు

అట్టుడుకుతున్న లాస్ఏంజెల్స్..  అక్రమ వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ మూడోరోజూ కొనసాగిన ఆందోళనలు
  • నేషనల్​ గార్డ్స్​ మోహరింపును తీవ్రంగా నిరసించిన స్థానికులు
  • మాస్క్​లతో ముఖం కప్పుకుని రెచ్చిపోయిన ఆందోళనకారులు
  • వీధుల్లో తిరుగుతూ కార్లకు నిప్పు
  • టియర్​గ్యాస్, రబ్బర్​ బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు మాస్కుతో కనిపించిన వాళ్లందరినీ అరెస్ట్​ చేయాలని ట్రంప్​ ఆర్డర్​

లాస్​ఏంజెల్స్: అమెరికాలోని లాస్​ఏంజెల్స్​ నగరం రణరంగంగా మారింది. అక్రమ వలసదారుల ఏరివేతకు నిరసనగా స్థానికులు చేపట్టిన ఆందోళనలు వరుసగా మూడోరోజూ కొనసాగాయి. ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్​ను మోహరించగా.. ఈ నిర్ణయంపై మండిపడుతూ వేలాదిమంది రోడ్లపైకి వచ్చారు. దీంతో సిటీలో ఉద్రిక్తత నెలకొన్నది.

 ఇమిగ్రేషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌(ఐసీఈ) విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2 వేల మంది ఆందోళనకారులు డౌన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌లోని ప్రధాన హైవేను తమ కంట్రోల్​లోకి తీసుకొన్నారు. ముఖానికి మాస్కులు తొడుక్కొని వీధుల్లో హల్​చల్​ చేశారు.  సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ కార్లకు  నిప్పు పెట్టారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ను తగులబెట్టడంతో అవి భారీ శబ్దాలు చేస్తూ పేలిపోయాయి.  101 ఫ్రీ వేను ఆందోళనకారులు అడ్డుకోవడంతో అధికారులు ఆ మార్గాన్ని మూసేశారు. 

దీంతో ఆందోళనకారులు పోలీసులపై చేతుల్లో ఉన్న వస్తువులను విసిరారు. పోలీసు వెహికల్స్​కు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌లో ఎవరూ గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు రబ్బరు బుల్లెట్లు, టియర్ ​గ్యాస్​ ప్రయోగించాయి. లైవ్​లో న్యూస్​ ప్రెజెంట్​ చేస్తున్న ఓ రిపోర్టర్‌‌‌‌‌‌‌‌కు రబ్బరు బుల్లెట్ ​తగిలి, గాయాలయ్యాయి.

ఆందోళనకారులపై ఉక్కుపాదం

ఇల్లీగల్​ ఇమిగ్రెంట్స్​ ఏరివేతకు ట్రంప్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ మొదలెట్టిన కార్యక్రమం మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలను అణచివేసేందుకు  ‘నేషనల్‌‌‌‌‌‌‌‌ గార్డ్‌‌‌‌‌‌‌‌’ బలగాలను ట్రంప్​ రంగంలోకి దింపారు. లాస్​ఏంజెల్స్ పరిధిలోనే ఏకంగా 2 వేల మంది కాలిఫోర్నియా నేషనల్‌‌‌‌‌‌‌‌ గార్డ్స్​ మోహరించారు. దీంతో ఆందోళనకారులు తమ నిరసనలను ఉధృతంచేశారు. ఫెడరల్​ ఏజెంట్లు, ఎఫ్‌‌‌‌‌‌‌‌బీఐ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

కాగా, ఆందోళనలపై  ప్రెసిడెంట్​ ట్రంప్ ట్రూత్​ వేదికగా విరుచుకుపడ్డారు. ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్​ఏంజెల్స్​ను అక్రమ వలసదారులు, క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌ ఆక్రమించారని ఫైర్​ అయ్యారు. లాస్​ఏంజెల్స్​లో మాస్కుతో కనిపిస్తే వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.  ఆందోళనల్లో మాస్క్‌‌‌‌‌‌‌‌ల వినియోగాన్ని ఆయన నిషేధించారు.