ఐపీఎల్‌‌ను విస్తరించడానికి ఇదే కరెక్ట్ టైమ్

ఐపీఎల్‌‌ను విస్తరించడానికి ఇదే కరెక్ట్ టైమ్

బెంగళూరు: ఐపీఎల్‌‌లో మరో కొత్త టీమ్ చేరబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నూతన టీమ్‌‌ను దక్కించుకోవడానికి మలయాళ సూపర్ స్టార్ మోహన్‌‌లాల్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ యత్నిస్తున్నారని గాసిప్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ విస్తరణపై టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ఐపీఎల్ టోర్నీ విస్తరణకు కరెక్ట్ టైమ్ ఇదేనన్నాడు. క్వాలిటీతో పాటు దేశంలో భారీగా ఉన్న ట్యాలెంట్‌‌కు అవకాశం కల్పించే దిశగా ముందుకెళ్లాలని పేర్కొన్నాడు.

‘యంగ్ ట్యాలెంట్‌‌ను దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్‌‌ను విస్తరిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. నైపుణ్యం ఉండి కూడా అవకాశాలు దక్కని వారు చాలా మంది ఉన్నారు. ఐపీఎల్‌‌లో మరిన్ని టీమ్స్‌‌ను చేరిస్తే యంగ్ ప్లేయర్లకు ఆడటానికి అవకాశాలు పెరుగుతాయి. దీనిపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోవాలి. వచ్చే ఏడాది తొమ్మిది టీమ్స్‌‌తో టోర్నీ నిర్వహించడం పెద్ద కష్టమేం కాబోదు. టోర్నీలో క్వాలిటీని పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. ముంబై ఇండియన్స్ జట్టునే చూస్కోండి.. ఆ జట్టు హై క్వాలిటీతో బలంగా ఉంది. వరల్డ్ క్లాస్ టీ20 ప్లేయర్లతో జట్టును సమతూకంగా కనిపిస్తోంది. ఆ టీమ్‌‌లో యంగ్ ట్యాలెంట్‌‌కూ కొదవలేదు’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.