డేటింగ్ యాప్​లో  ప్రేమ.. పెళ్లి పేరుతో మోసం

V6 Velugu Posted on Jul 15, 2021

కూకట్​పల్లి, వెలుగు: డేటింగ్​ యాప్ లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వివాహితుడైన డాక్టర్​ను కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేట రోడ్​లో ఉంటోన్న ఓ యువతి(31) గతేడాది సెప్టెంబర్​లో తన ప్రొఫైల్​ను డేటింగ్ యాప్ ‘బంబుల్’ లో అప్ లోడ్ చేసింది. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్​లో న్యూరో సర్జన్ గా పనిచేస్తూ బంజారాహిల్స్ రోడ్ నం.5 లో ఉండే డాక్టర్ గబ్బిట అభిరామ్ చంద్ర(33) బంబుల్ యాప్ ద్వారా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకోవాలని అభిరామ్ ఆ యువతిని కోరాడు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. అభిరామ్​కు అంతకుముందే పెళ్లయిందనే విషయాన్ని ఇటీవల తెలుసుకున్న ఆ యువతి తాను మోసపోయినట్లు గుర్తించి కేపీహెచ్ బీ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు బుధవారం డాక్టర్ అభిరామ్ చంద్రను అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు.

Tagged Hyderabad, love, marriage, cheating, dating app,

Latest Videos

Subscribe Now

More News