
ఒమర్ లులు డైరెక్షన్ లో ప్రియాప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ నటించిన సినిమా ఒరు అదార్ లవ్. తెలుగులో లవర్స్ డే పేరుతో ఈ నెల 14న విడుదలవుతున్న ఈ మూవీ టీజర్ ఇవాళ రిలీజైంది. 56 సెకన్లున్న ఈ టీజర్ లో లవ్ రొమాంటిక్ సీన్ బాగా పండించారు. టీజర్ ప్రారంభంలో.. ‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదు..’ అంటూ ప్రియా వారియర్, రోషన్ ల మధ్య జరిగే రొమాంటిక్ సీన్ టీజర్ లో చూపించారు.
ఇద్దరి యాక్టింగ్ క్యూట్ గా ఉంది. షాన్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రారంభం నుంచే హైప్ తీసుకురాగా..సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నారు యూత్.