మారిన ప్రియుడు.. హస్పిటల్ లోనే పెళ్లి

మారిన ప్రియుడు.. హస్పిటల్ లోనే పెళ్లి

పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియురాలిని ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా ఆమెను గర్భవతిని చేశాడు. ఆ తర్వాత మోహం చాటేశాడు. డెలివరీ సమయంలో ఆమెకు మృత శిశువు పుట్టడంతో గ్రామస్థులంతా కలిసి ప్రియుడికి నచ్చజెప్పారు.  బిడ్డను కోల్పోయిన ఆమెను చూసి బాధపడ్డ అతడు చివరకు హస్పిటల్ లో ప్రియురాలి మెడలో తాళి కట్టాడు. ఈ అరుదైన పెళ్లి… రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.

చిన్నబోనాల గ్రామానికి చెందిన ముత్యాల రాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దేవలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమాయణం ఐదేళ్లు సాగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి… ఆమెను గర్భవతిని కూడా చేశాడు ముత్యాలరాజు. ఆ తర్వాత మొహం చాటేశాడు. యువతి మృతశిశువుకు జన్మనిచ్చి… జిల్లా ఏరియా హస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఆమెకు జరిగిన అన్యాయం తెలుసుకుని గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. మోసం చేసిన ముత్యాలరాజుతో మాట్లాడి.. బాధితురాలిని న్యాయం జరిగేలా చేశారు. ఈ మేరకు గ్రామస్తులు తమ మధ్యవర్తిత్వంతో హస్పిటల్ ఆవరణలోనే ముత్యాలరాజు-దేవలక్ష్మిల పెళ్లి జరిపించారు.