కొత్త మెడికల్ కాలేజీల్లో క్లాసులే జరుగుతలేవ్..71 శాతం స్టూడెంట్లకు రోగులను పరీక్షించే అవకాశమే లేదు

కొత్త మెడికల్ కాలేజీల్లో క్లాసులే జరుగుతలేవ్..71 శాతం స్టూడెంట్లకు రోగులను పరీక్షించే అవకాశమే లేదు

హైదరాబాద్​: వైద్య విద్యార్థులకు థియరీతో పాటు క్లినికల్ ప్రాక్టీస్ కూడా ముఖ్యమైనదే. అయితే మెడికల్ కాలేజీలకు వచ్చే పేషెంట్ల సంఖ్య తక్కువగా ఉంటున్నదని ఈ సర్వేలో తేలింది. దీంతో స్టూడెంట్లు సరిగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నట్లు వెల్లడైంది. 71.5 శాతం మంది విద్యార్థులు తమకు రోగులను పరీక్షించే అవకాశం తగినంతగా రాలేదని వాపోయారు. 

కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరతకూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు సర్వేస్పష్టం చేసింది. తమ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్నట్లు 68.8 శాతం మంది విద్యార్థులు పేర్కొన్నారు.అలాగే తమకు రెగ్యులర్ గా టీచింగ్ సెషన్స్ జరగడం లేదని 54.3 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ల్యాబ్స్, ఇతర ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఏమాత్రం బాగాలేవని 69.2 శాతం మంది చెప్పారు. 

కాలేజీల్లో నైపుణ్యాలను పెంచే స్కిల్ ల్యాబ్స్ ఉన్నాయా? ప్రశ్నిస్తే.. 44.1శాతం మంది మాత్రమే ఉన్నాయని చెప్పడం గమ నార్హం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మెడికల్ ఎడ్యుకేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని 89.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మందికి కూడా టైము స్టెఫండ్ అందడం లేదు. 

పని గంటలపై ఎలాంటి కంట్రోల్ లేదని, చేయాల్సిన పనికంటే ఎక్కువగా చేయాల్సి వస్తున్నదని, కేవలం 29.5 శాతం మందికి మాత్రమే ఫిక్స్ డ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. తమతో క్లరిక ల్ పనులు ఎక్కువగా చేయించుకుంటున్నారని 73.9 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. పని వాతావరణం చాలా దారుణంగా, స్ట్రెస్ తో కూడుకొని ఉన్నదని 40.8 శాతం మంది తెలిపారు.

విద్యార్థుల్లో కాన్ఫిడెంట్ లేదు..

అరకొర సౌకర్యాల నడుమ వైద్య విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థులు... ప్రాక్టీస్ చేయాలంటేనే భయపడుతున్నట్టు ఫైమా నిర్వహించిన సర్వేలో తేలింది. తమ స్కిల్స్ పై 70 శాతం మంది విద్యా ర్థులు నమ్మకంతో ఉన్నప్పటికీ.. సొంతంగా ప్రా క్టీస్ చేయగలరా? అని వాళ్లను ప్రశ్నిస్తే. కేవలం 57 శాతం మంది మాత్రమే అందుకు అవునని చెప్పారు. 

అంటే ప్రస్తుత మెడికల్ విద్య.. విద్యార్థుల్లో విశ్వాసాన్ని తీసుకురాలేకపోతున్నదని అర్థ మవుతున్నది. సర్వేలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను పోల్చి చూస్తే.. ప్రైవేట్ కాలేజీల్లో ఫ్యా కల్టీ ఉన్నట్లు, పేషెంట్ల సంఖ్య మెరుగ్గానే ఉన్న ట్టు వెల్లడైంది. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మినిస్ట్రేటివ్ పనుల భారం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.