బంగాళాఖాతంలో అల్పపీడనం .. తెలంగాణలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం .. తెలంగాణలో భారీ వర్షాలు

ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ ఎత్తు వరకు వ్యాపించింది. దీంతో  తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు .  పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు హై అలెర్ట్ ప్రకటించారు.  

హైదరాబాద్‌లో వాతావరణం

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 90 శాతంగా నమోదైంది.