అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఎల్ఆర్ఎస్ ఫీజులు

అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఎల్ఆర్ఎస్ ఫీజులు

సీఎం మరో నిజాంలా మారిండు
రీడిజైనింగ్ పేరిట రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు
బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్
ఎల్ఆర్ఎస్​ రద్దు కోసం సిద్దిపేటలో నిరసన

సిద్దిపేట, వెలుగు: ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట ప్రజలపై రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారం మోపిన సీఎం కేసీఆర్, వాటికి వడ్డీలు కట్టేందుకే ఎల్ఆర్ఎస్ పేరిట జనాలను దోచుకోవాలని చూస్తున్నాడని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఎల్ఆర్ఎస్​ రద్దు చేయాలని, డబుల్ బెడ్​రూమ్​ ఇండ్లను వెంటనే పూర్తిచేసి పంపిణీ చేయాలనే డిమాండ్​తో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్​ను ముట్టడించారు. ఇందులో పాల్గొన్న వివేక్​ మీడియాతో మాట్లాడుతూ.. నిజాం సర్కారును తలపించేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు ఇస్తామని  చెప్పిన కేసీఆర్.. అధికారం చేపట్టాక ఆ విషయాన్నే మర్చిపోయారన్నారు. పోలీసులతో ప్రతి పక్షాల గొంతు నొక్కాలని సీఎం ప్రయత్నిస్తున్నాడన్నారు. అగ్రికల్చర్​ బిల్లు విషయంలో అధికార పార్టీ ఆందోళనలను అడ్డుకోని పోలీసులు.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న  బీజేపీ లీడర్లను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్​తో మూడు లక్షల కోట్లకు చేరిన అప్పుకు నెలకు మూడు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే  ఎల్​ఆర్​ఎస్​ వంటి కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతున్నారని వివేక్ మండిపడ్డారు. 140 కోట్ల ప్రజానికానికి ప్రాతినిధ్యం వహించే కొత్త పార్లమెంట్​ నిర్మాణానికి 800 కోట్లు అవసరమవుతుంటే.. కేవలం మూడున్నర కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సెక్రటేరియెట్​ను వెయ్యి కోట్లతో కట్టాలనుకోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. సీఎం అవినీతి, అక్రమాలపై కేంద్రానికి వివరించినట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌ స్కీమ్​ను​ రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. వివేక్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి, సురేశ్​గౌడ్​ తదితరులు ఉన్నారు.

For More News..

నీటిని తరలించేందుకు స్పీడ్ పెంచిన ఏపీ

ఎన్నికల కసరత్తు షురూ చేసిన బల్దియా

అసైన్డ్ భూములపై కన్నేసిన ప్రభుత్వం