కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్
రాహుల్ మళ్లీ ఇలాంటి తప్పులు చేస్తే ఒక మ్యాచ్ బ్యాన్..!
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ తెలిపింది. డీవై పాటిల్ వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నిబంధన అతిక్రమించినట్లు సమాచారం అందింది. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేఎల్ రాహుల్ లెవల్-1 నిబంధన ఉల్లఘించినట్లు తేలింది. రాహుల్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో రూల్ ప్రకారం అతని మ్యాచ్ ఫీజు నుంచి 20 శాతం కోత విధిస్తున్నాం అంటూ ప్రకటనలో తెలిపింది. కాగా కేఎల్ రాహుల్ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా 12 లక్షల జరిమానా పడింది. మరో రెండుసార్లు రాహుల్ స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఒక మ్యాచ్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
