LSG vs DC: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన రిషబ్ పంత్.. ఏం జరిగిందంటే?

LSG vs DC: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన రిషబ్ పంత్.. ఏం జరిగిందంటే?

శుక్రవారం(ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్‌ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గందరగోళం తలెత్తింది. డిఆర్‌ఎస్(DRS) కాల్‌పై ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన సంజ్ఞలే అందుకు కారణం. పంత్ చర్యల కారణంగా అతనికి.. అంపైర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. లక్నో ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

లక్నో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో ఇషాంత్ శర్మ వేసిన 4వ బంతి బ్యాటర్‌కు ఎడమ వైపుగా వెళ్ళింది. అంపైర్.. వైడ్ అని సిగ్నల్ ఇచ్చారు. ఆ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పంత్ రివ్యూ కోరినట్లు సంజ్ఞలు చేశాడు. వెంటనే ఆన్‌ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా రీప్లేలో బంతి.. బ్యాటర్‪ను తాకలేదని తేలింది. ఫైనల్‌గా అది వైడ్ అని నిర్ణయించారు. ఆ సమయంలో పంత్.. తాను డిఆర్‌ఎస్ కోరలేదని పట్టుబట్టారు. సమీక్ష కోరాలా..! వద్దా..! అని బౌలర్‌తో చర్చిస్తున్నట్లు తెలిపాడు. అయితే, అంపైర్.. అతని వాదనతో ఏకీభవించలేదు. డిఆర్‌ఎస్ కోరినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.