ఆర్మీ కొత్త వైస్​ చీఫ్ గా లెఫ్టినెంట్​ జనరల్​​ బీఎస్​ రాజు

ఆర్మీ కొత్త వైస్​ చీఫ్ గా లెఫ్టినెంట్​ జనరల్​​ బీఎస్​ రాజు


న్యూఢిల్లీ: ఇండియన్‌‌ ఆర్మీ కొత్త వైస్‌‌ చీఫ్‌‌గా లెఫ్టినెంట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ రాజు ను కేంద్రం శుక్రవారం నియమించింది. మే1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. వైస్‌‌ చీఫ్‌‌ ఆఫ్‌‌ ఆర్మీ స్టాఫ్‌‌ (వీసీవోఏఎస్)గా నియమితులైన బీఎస్‌‌ రాజుకు జనరల్‌‌ ఎంఎం నరవాణే సహా ఉన్నతాధికారులు అభినందనలు తెలిపినట్లు ఆర్మీ ఆఫీషియల్‌‌ ట్విట్టర్‌‌‌‌లో వెల్లడించింది. అలాగే, ఆర్మీ చీఫ్ జనరల్​ ఎంఎం నరవాణే త్వరలో రిటైర్​ కానున్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు వైస్​ చీఫ్​గా ఉన్న లెఫ్టినెంట్​ జనరల్​ మనోజ్​ పాండే బాధ్యతలు చేపడతారని  వివరించింది.